తనపై ఆంక్షలు పెడుతున్నారు కానీ… నేరాగాళ్లపై ఎలాంటి ఆంక్షలు లేవు
విశాఖపట్నంలో వృద్ధురాలిని వాలంటీర్ చంపేస్తే అధికార పక్షం నుంచి స్పందనే లేదని జనసేన అధినేత పవన్ కల్యాన్ విమర్శించారు. వారాహి యాత్రలో భాగంగా పవన్ విశాఖపట్నంలో పర్యటించారు. ఈ సందర్భంగా పెందుర్తిలో వాలంటీర్ చేతిలో హత్యకు గురైన బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ వృద్ధురాలిని వాలంటీర్ హత్య చేయడం దురదృష్టకరం. ప్రతి కుటుంబం పిల్లలు, మహిళల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. గతంలో మహిళల మిస్సింగ్‌పై చేసిన గణాంకాలు నేను చెప్పివని కావు. పరిశోధన సంస్థలు చెప్పిన గణాంకాలే నేను ప్రస్తావించాను. రౌడీషీటర్‌కు ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేసే ధైర్యం ఎక్కడిది? కిడ్నాప్‌కు గురైన అదే ఎంపీ రౌడీషీటర్‌కు వత్తాసు పలికేలా చర్యలు ఉండటమేంటి? అని ప్రశ్నించారు. నాపై ఆంక్షలు పెడుతున్నారు కానీ నేరగాళ్లకు ఎలాంటి ఆంక్షలు లేవు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.













