పొత్తులపై చర్చలు.. భవిష్యత్తులో కొత్త ప్రభుత్వం
వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ నేరాలకు నిలయంగా మారిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చిత్తూరులో ఒకేరోజు చాలా మంది బాలికలు అదృశ్యమయ్యారని ఆరోపించారు. దీనిపై దర్యాప్తు చేయాలని కోరితే పోలీసులు ఏమీ జరగనట్లే మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్, మైనింగ్ వ్యాపారం జరుగుతోంది. ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులకు రూ.వేల కోట్లు అక్రమంగా వెళ్తున్నాయి. ఉత్తరాంధ్రను దోచేందుకే విశాఖ రాజధాని అంటూ ముఖ్యమంత్రి హడావుడి చేస్తున్నారు. ఉత్తరాంధ్రలో 30 వేల ఎకరాలకు పైగా భూములు జగన్ అండ్ కో గుప్పిట్లో ఉన్నాయి. సీఎం జగన్ అడ్డగోలుగా ప్రభుత్వ ఆస్తులను దోచుకుంటున్నారు. జగన్ రాజకీయ నాయకుడు కాదు, వ్యాపారి. బ్రిటీష్ హయాంలో కంటే తీవ్రంగా విభజించి పాలిస్తున్నారు. యువతులు అదృశ్యమైతే సీఎం స్పందించలేదు. అన్నీ బేరీజు వేసి చూస్తే టీడీపీ పాలనే మంచిదనిపించింది. వైసీపీ ప్రభుత్వాన్ని దించి తీరుతాం. పొత్తులపై చర్చలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో కొత్త ప్రభుత్వం వస్తుంది. నేను పదేళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నా, సీఎంగా చేయడానికి సంసిద్ధంగా ఉన్నా అని అన్నారు.













