భాషా ప్రతిపదికన ఏర్పడిన తొలిరాష్ట్రం మనదే
స్వతంత్య్ర భారతదేశంలో భాషా ప్రతిపదికన ఏర్పడిన తొలి రాష్ట్రం మనదే అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణతోనే తెలుగు వారి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని దీనిని ఎవరూ మరువకూడదన్నారు. ఆయన త్యాగాలను స్ఫూర్తిని భావితరాలకు తెలియ చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. రాష్ట్రానికి ఇప్పటికే శాశ్వతమైన రాజధాని లేకపోవడం పాలకుల లోపభూయిష్ట విధానాలేనని అన్నారు. శాశ్వత రాజధానితో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో శాశ్వత పయనించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.













