Pawan Kalyan: సంతోషించే సమయమా ఇది?.. ఫ్యాన్స్‌పై పవన్ సీరియస్!
తిరుపతిలో జరిగిన తొక్కిసలాట అనంతరం, బాధితులను పరామర్శించేందుకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూడా తిరుపతి చేరుకున్నారు. స్విమ్స్ ఆసుపత్రిలో బాధితులను కలిసేందుకు ఆయన వచ్చినప్పుడు.. పవన్ ఫ్యాన్స్ కొందరు ఆయన్ను అక్కడ చూసి ఎగ్జయిట్ అయిపోయారు. పవన్‌ను చూసి కేరింతలు కొడుతూ కేకలు వేశారు, చేతులూపుతూ కోలాహలం చేశారు. ఇది గమనించిన పవన్‌కు కోపం వచ్చేసింది.
‘ఇది ఆనందించే టైమా? బాధ అనిపించడం లేదా మీకెవ్వరికీ!’ అని వాళ్లను ప్రశ్నించారు. అక్కడితో ఆగకుండా అభిమానుల వైపు చూస్తూ.. ‘మనుషులు చచ్చిపోయారు.. మనుషులు చచ్చిపోయారు’ అంటూ గట్టిగా అరిచారు. అలాగే అక్కడే ఉన్న పోలీసులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ (Pawan Kalyan).. ‘జనాన్ని కంట్రోల్ చేయండి. బాధ్యతా రాహిత్యంగా ఉండొద్దు’ అంటూ అసహనం వ్యక్తం చేశారు.













