ఒక్కో ప్రమాదానికి ఒక్కోలా.. పరిహారం ఏమిటి? :పవన్
ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ రసాయన పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటన అత్యంత బాధాకరమని జనసేన అధ్యక్షుడు పనన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన మీడియతో మాట్లాడుతూ ఆరుగురు కార్మికులు సజీవదహనం అయిన విషయం ఎంతో ఆవేదనకు గురిచేసిందన్నారు. కార్మికుల కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒక్కో ప్రమాదానికి ఒక్కోలా పరిహారం ఏమిటి? అని ప్రశ్నించారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించి న్యాయబద్ధంగా పరిహారం ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రసాయన కర్మాగారాల్లో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, అధికార యంత్రాంగం భద్రతా ప్రమాణాలపై నిరంతరం తనిఖీలు చేసి నిబంధనలు కఠినంగా అమలు చేయాలని కోరారు.













