ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఒడిషా రాష్ట్ర ఎంపీ సౌమ్యా రంజన్ పట్నాయక్ భేటీ
ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రతినిధిగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి వివిధ అంశాలపై చర్చించిన ఎంపీ సౌమ్యా రంజన్ పట్నాయక్.
ఇరువురి మధ్య కీలక అంశాలపై చర్చ
మహిళా రిజర్వేషన్లు, ఈవీఎం మిషన్లు వంటి అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు ప్రస్తావించిన ఎంపీ సౌమ్యా రంజన్ పట్నాయక్.
తన ప్రతినిధిగా వెళ్లి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో మాట్లాడి రావాలని ఎంపీ సౌమ్యా రంజన్ పట్నాయక్ను పంపించిన ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై ఇటీవలి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లేవనెత్తిన అభ్యంతరాలకు మద్ధతు తెలుపుతున్న ఒడిషా సీయం.
ప్రజాస్వామ్యానికి పెనుముప్పుగా మారనున్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల స్థానంలో పేపర్ బ్యాలెట్ విధానాన్ని తిరిగి తీసుకురావాలని కోరుతున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.
మద్దతు తెలిపిన ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్.
ఈ అంశంతో పాటు పలు జాతీయ అంశాలపై కలిసి పనిచేయాలన్న ప్రతిపాదనపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఎంపీ సౌమ్యా రంజన్ పట్నాయక్ చర్చలు.
ఒడిషా, ఆంధ్రప్రదేశ్ మధ్య స్నేహపూరిత సంబంధాలు కొనసాగాలని ఉభయుల ఆకాంక్ష.
రెండు రాష్ట్రాల మధ్య ఉన్న చిన్నచిన్న సమస్యల్ని కూర్చుని చర్చించి సామరస్యంగా పరిష్కరించుకుందామన్న ఒడిషా ఎంపీ రంజన్ పట్నాయక్.
ప్రజాస్వామ్య పరిరక్షణకు జాతీయ స్థాయిలో జరిపే పోరాటంలో బాసటగా ఉంటామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలిపిన ఒడిషా ఎంపీ పట్నాయక్.
చర్చలలో ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు.













