నర్సాపురం ఎంపీగా ఎన్ఆర్ఐ!
నర్సాపురం లోక్సభ నియోజకవర్గానికి అనూహ్యంగా ప్రవాస భారతీయులు రావి దీపిక పేరు తెరపైకి వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుండి పిలుపు రావడంతో ప్రవాస భారతీయ దంపతులు అమరావతికి వెళ్లారు. కాపు సామాజికవర్గ సమీకరణలో భాగంగా ఆమె పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. మహిళ కావడం ఆమె కు కలిసి వస్తున్న అంశం. ఇదే స్థానం నుంచి కొత్తపల్లి సుబ్బారాయుడిని పోటీకి దింపాలని పార్టీ ఆలోచించింది. అయితే అసెంబ్లీకి మాత్రమే పోటీ చేస్తానని ఆయన సృష్టం చేశారు. అదే సమయంలో రాజ్యసభ సభ్యురాలు తోత సీతారామలక్ష్మి కూడా పోటీకి వెనుకంజ వేశారు. ఈ నేపథ్యంలోనే అదే సామాజికవర్గానికి చెందని రావి దీపిక పేరును పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం.
నర్సాపురం పట్టణానికి చెందిన ఆమె చాలాకాలంగా సౌదీలో నివాసముంటున్నారు. ఆమె భర్త రాధాకృష్ణ అరంకో సంస్థలో కంట్రాక్టర్. అదీ నుండీ టీడీపీకి అభిమానులైన ఈ కుటుంబంపై దృష్టి పడింది. చంద్రబాబు నుండి పిలువు రావడంతో దంపతులిద్దరూ హుటాహుటిన అమరావతికి వెళ్లారు. చివరి నిమిషంలో సమీకరణాల దృష్ట్యా క్షత్రియ సామాజికవర్గానికి ప్రాధాన్యం ఇవ్వాల్సి వస్త మాత్రం దీపికకు అవకాశం దక్కదు.













