తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసింది. ఆంధ్రప్రదేశ్‌లోని 175 శాసనసభ నియోజకవర్గాలకు మొత్తం 4,210 నామినేషన్లు, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు 731 నామినేషన్లు దాఖలయ్యాయి. తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు గానూ 625 నామినేషన్లు నమోదయ్యాయి. మే 13న పోలింగ్, జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.