ఆంధ్రప్రదేశ్ లో ఉప ఎన్నికలు లేవు
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించిన కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేకెన్సీలకు ఉప ఉన్నికలు లేవని తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో జరగాల్సిన ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల ఉప ఎన్నికలకు సంబంధించి కూడా ఎన్నికల సంఘం సృష్టత ఇచ్చింది. ఐదుగురు వైఎస్ఆర్సీపీ ఎంపీల రాజీనామాలపై ఆయన మాట్లాడుతూ, ఎంపీల రాజీనామాలను జూన్ 4న ఆమోదించడం జరిగిందన్నారు. జూన్ 3వ తేదీతో లోక్సభ గడువు ముగుస్తుందని, ఎన్నికల నిర్వహణకు ఏడాది కంటే తక్కువగానే గడువు ఉన్నందున ఉప ఎన్నికలు ఉండవని రావత్ ప్రకటించారు.













