వచ్చే మహానాడు అమరావతిలో
తెలుగుదేశం పార్టీ మహానాడు ఈ సారి అమరావతిలో జరుగనుంది. ఈ మేరకు పార్టీ అధినేత సంకేతాలు ఇచ్చారు. గత మహానాడును విశాఖపట్నంలో మూడు రోజుల పాటు నిర్వహించిన తెలుగుదేశం పార్టీ ఈ సారి నిర్వహించే ప్రదేశాన్ని మార్చాలనే యోచనలో వుంది. ఇక నుంచి జాతీయ రాజకీయాలపై కూడా దృష్టి సారించే యోచనలో వున్న ముఖ్యమంత్రి వచ్చే మహానాడుకు వివిధ ప్రాంతీయ పార్టీల నేతలను కూడా ఆహ్వానించనున్నారు. గతంలో నేషనల్ ఫ్రంట్ తరహాలోనే కొత్తగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలనే యోచనలో చంద్రబాబు నాయుడు వున్నారని, అయితే రాజకీయ పరిస్థితులు అనుకూలిస్తే ఫ్రంట్‌పై ఒక నిర్ణయం తీసుకుంటారనే అభిప్రాయం అధినేత మనసులో వున్నట్టు సమాచారం.













