ముఖ్యమంత్రికి నాయీబ్రాహ్మణులు,స్వర్ణకారుల సంఘాల వినతులు
ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడును గురువారం ప్రజావేదికలో నాయీ బ్రాహ్మణులు,స్వర్ణ కారుల సంఘాల ప్రతినిధులు కలిసి వినతి పత్రాలు అందజేశారు.
‘‘272జీవోను మార్పులతో అమలు చేయాలి.స్వర్ణకార కార్పోరేషన్ ఏర్పాటు చేయాలి. అక్రమ కేసులు,వేధింపులు లేకుండా చేయాలి’’ అని స్వర్ణకారుల సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రిని కోరారు. అధికారులతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. పారేపల్లి మహేష్,గాజుల శ్రీనివాస రావు,జన్నాదుల శ్రీనివాస రావు, దుర్గ,ఓంకార్,వర ప్రసాద్ తదితరులు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.
50ఏళ్లు దాటిన వాయిద్య కళాకారులకు,వృత్తిదారులకు రూ.2వేలు పించన్ ఇవ్వాలని,నాయీ బ్రాహ్మణ కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని,దేవాలయ పాలకవర్గాలలో శాశ్వత సభ్యులుగా నియమించాలని,డొమెస్టిక్ పద్దతిలో క్షౌరశాలలకు విద్యుత్ కల్పించాలని,నామినేటెడ్ పోస్ట్ ల నియామకంలో ప్రాధాన్యత ఇవ్వాలని,ఎస్సీ జాబితాలో చేర్చాలని,ఆరోగ్య బీమా వర్తింప కల్పించాలని నాయీబ్రాహ్మణ సేవా సంఘ ప్రతినిధులు కోరారు. బాల గురుస్వామి,అశోక్ కుమార్,చిన వెంకటేశ్వర్లు,గోపాలకృష్ణ,వెంకట్రావు,అమర నాధ్ తదితరులు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.













