Nara Lokesh: మహానాడు ఏర్పాట్లపై మంత్రి లోకేశ్ సమీక్ష
తెలుగుదేశం పార్టీ మహానాడు (Mahanadu)కు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మహానాడును మే 27 నుంచి 29 వరకు కడప (Kadapa)లో పండుగ వాతావరణంలో నిర్వహించనున్నట్లు మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh ) తెలిపారు. మహానాడు ఏర్పాట్లపై పొలిట్ బ్యూరో సమావేశానికి ముందు ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మహానాడు కమిటీల కన్వీనర్లు, కో కన్వీనర్లతో సమావేశమయ్యారు. మహానాడు ఏర్పాట్ల గురించి నేతలతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులు, సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగించారు. పొలిట్ బ్యూరో సమవేశంలో మహానాడు ఏర్పాట్లపై మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలోని మంత్రుల (Ministers) కమిటీ నివేదిక ఇవ్వనుంది.
ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ ఏటా మహానాడును పండుగ వారతావరణంలో నిర్వహిస్తున్నాం. పార్టీ కష్టకాలంలో ఉన్నా, అధికారంలో ఉన్నా మహానాడును నిర్వహించాం. గత ప్రభుత్వలో మహానాడుకు అడుగడుగునా ఇబ్బందులు పెట్టారు. అయినా ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి విజయంతం చేశారు. పార్టీ ఆవిర్భావం తర్వాత చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా తిరుగులేని మెజార్టీ సాధించాం. మహానాడుకు వచ్చే కార్యకర్తలకు వసతి, రవాణాకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి అని నేతలకు దిశానిర్ధేశం చేశారు.













