ఎక్కడ అక్రమాలు జరిగాయో త్వరలో చెబుతాం : మంత్రి లోకేశ్
చంద్రబాబు అంటేనే ఒక బ్రాండ్, ఆయన సీఎం అయ్యాక పారిశ్రామిక వేత్తలు మళ్లీ వస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాపాలన వచ్చిందని పారిశ్రామికవేత్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో రూ.లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టేలా అదానీని గతంలో ఒప్పించాం. గత ప్రభుత్వ వైఖరి వల్ల పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు తరలివెళ్లాయి. రాష్ట్ర వ్యాప్తంగా భూ అక్రమాలు జరిగాయి. గత ప్రభుత్వ మా అక్రమాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది. ఎన్ని ఎకరాలు ఎక్కడ అక్రమాలు జరిగాయో త్వరలో చెబుతాం. మొన్నటి వరకు విశాఖలో రాజారెడ్డి రాజ్యాంగం నడిచింది. కిడ్నాప్‌లు జరిగాయి, అడ్డగోలుగా భూములు లాక్కున్నారు. విశాఖలో దసపల్లా భూములు లాగేసుకున్నారు. మేం ఇచ్చిన ఆరు హామీలకు కట్టుబడి ఉన్నాం. ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలి అని అన్నారు.













