ఏపీలో ఐదు సైబరాబాద్ ల నిర్మాణమే మా విజన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు సైబరాబాద్‌లు నిర్మించాలనేది తమ విజన్ అని మంత్రి నారా లోకేష్ తెలిపారు. అమరావతిలో ఏపీ ఎన్నార్టీ పార్క్‌లో ఒకేసారి 10 ఐటీ సంస్థలను మంత్రి నారా లోకేష్ లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఐటీ కంపెనీల సీఈవోలతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్ష ఐటీ ఉద్యోగాలు, ఎలక్ట్రానిక్ రంగంలో 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఇప్పటి వరకు ఐటీలో 36 వేలు, ఎలక్ట్రానిక్ల్సో 20 వేల ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. రాష్ట్రంలో 53 కంపెనీలకు 24 కోట్ల రూపాయల మేర రాయితీలు ఇస్తున్నామన్నారు.
జియో ఫోన్ల తయారీ కోసం తిరుపతిలో 125 ఎకరాలు సేకరించామని సమావేశంలో పేర్కొన్నారు. విశాఖ, చిత్తూరు, అనంతపురం, గోదావరి జిల్లాల్లో ఐటీని అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఏపీలో ఎంవోయూ కన్వర్షన్ 48 నుంచి 53 శాతం ఉందని పేర్కొన్నారు. సీఐఐ సదస్సులో ఐటీ శాఖ కుదుర్చుకున్న ఎంవోయూలు దాదాపు వాస్తవం రూపం దాల్చాయన్నారు. ఫైబర్ గ్రిడ్‌కు ఎంఎస్‌వోలు సహకరించాలని కోరారు. ఫైబర్‌గ్రిడ్‌తో ఎంఎస్‌వోలకు మరింత ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. ఆగస్టు 15 నాటికి ఫైబర్ గ్రిడ్ ద్వారా 5 లక్షల కనెక్షన్లు ఇస్తామని తెలిపారు. డిసెంబర్ నెలాఖరు నాటికి అన్ని పంచాయతీలకు ఫ్రీ వైఫై కన్షెక్షన్ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలనకు నిర్ణయం తీసుకున్నామని ఈ సందర్భంగా లోకేష్ పేర్కొన్నారు.













