తెలుగుదేశం పార్టీ ఎల్లవేళలా అండగా : భువనేశ్వరి
విజయనగరంలో టీడీపీ కార్యకర్త కోరాడ అప్పారావు కుటుంబాన్ని నారా భువనేశ్వరి పరామర్శించారు. చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక అప్పారావు గుండెపోటుతో గతేడాది సెప్టెంబరు 10న మృతి చెందారు. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. బాధిత కుటుంబాన్ని నారా భువనేశ్వరి పరామర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అప్పారావు భార్య పద్మావతి, కుమారుడు జయంత్సాయితో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి రూ.3 లక్షల చెక్కును అందించారు. తెలుగుదేశం పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా కల్పించారు.













