Balakrishna: రాజమండ్రిలో ఘనంగా బాలకృష్ణ జన్మదిన వేడుకలు…
విలక్షణ వ్యక్తిత్వం,సేవాభావం కలిగి ఇటు రాజకీయాలలో అటు సినిమా రంగంలో మకుటం లేని మహారాజుగా నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) వెలుగొందుతున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నందమూరి వంశాభిమానుల సంఘం గౌరవ అధ్యక్షులు గన్ని కృష్ణ అన్నారు.
హిందూపురం ఎమ్మెల్యే, యువరత్న నందమూరి బాలకృష్ణ జన్మదినోత్సవం సందర్భంగా నందమూరి వంశాభిమానుల సంఘం అధ్యక్షుడు గొర్రెల రమణ, బిక్కిన సాంబ ఆధ్వర్యంలో శ్రీరామనగర్ లో గన్ని నివాసం వద్ద వేడుకలు నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి గన్ని కృష్ణ తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అభిమానులు,తెదేపా కుటుంబ సభ్యుల మధ్య జై బాలయ్య నినాదాల మధ్య కేక్ కట్ చేశారు.
ఈ సందర్భంగా పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. వార్డుకు చెందిన షేక్ దావూద్ అనారోగ్యంతో బాదపడుతుండటంతో వారి కుటుంబానికి నెల సరిపడ నిత్యావసర వస్తువులను గన్ని కృష్ణ చేతుల మీదుగా అందజేశారు.
గన్ని కృష్ణ మాట్లాడుతూ విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు నట వారసునిగా చలనచిత్ర సీమలో అడుగుపెట్టి తనదైన శైలిలో రాణించి తెలుగు చలనచిత్ర రంగంలో అగ్రహీరోగా బాలకృష్ణ వెలుగొందుతున్నారని పేర్కొన్నారు. నందమూరి బాలకృష్ణ హీరోగానే కాకుండా సంఘ సేవాతత్పరుడిగా ఎంతో పేరు సంపాదించారని, తన తల్లి పేరిట బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటు చేసి ఎంతోమంది నిరుపేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నారని అన్నారు. రాజకీయాలలో అవినీతిమరక అంటుకోకుండా స్వచ్చమైన వ్యక్తిగా, హీరోగా బాలయ్య చరిత్రలో నిలిచిపోతారని పేర్కొన్నారు. విభిన్నపాత్రలతో అలరించే బాలకృష్ణ రాబోయే రోజుల్లో అభిమానులను, తెలుగు ప్రేక్షకులను మరింత అలరించాలని ఆకాంక్షించారు. అఖండ -2 టీజర్ చాలా అధ్బుతంగా ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న గన్ని కృష్ణ అల్లుడు, ఎన్ఆర్ఐ చుండ్రు సతీష్ మాట్లాడుతూ బాలకృష్ణ సినిమాలలోనే హీరో కాదని నిజ జీవితంలో కూడా ఆయన చేసే సేవాకార్యక్రమాల ద్వారా హీరోగా నిలుస్తూనే ఉన్నారని అన్నారు. ఈ సందర్భంగా ఎంసెట్ ఫలితాలలో 13ర్యాంకును సాధించిన బాలయ్య అభిమాని కుమారుడు పవన్ తనయ్ ను గన్ని అభినందించి సత్కరించారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్ కుమార్, పార్టీ నాయకులు నిమ్మలపూడి గోవింద్,కంటిపూడి శ్రీనివాస్, వారాది హనుమంతరావు, కోరుమెల్లి విజయశేఖర్, జక్కంపూడి అర్జున్, సూరంపూడి శ్రీహరి, రామినేని మస్తాన్ చౌదరి, ఎస్.ఎ కరీం, బెజవాడ వెంకటస్వామి, పిన్నింటి రవిశంకర్, రొక్కం సత్యనారాయణ, కంచిపాటి గోవింద్,నల్లం ఆనంద్, మళ్ళ వెంకటరాజు, సింహాద్రి కోటిలింగేశ్వరరావు, వానపల్లి శ్రీనివాస్, సింహాద్రి సతీష్, పేరూరి అంజి, అప్పలరాజు, పైలా రాంబాబు, ఆడారి లక్ష్మీనారాయణ, నాగేంద్ర, జాలెం అన్వేష్, సావిత్రి, వీరమ్మ సత్యవేణి, పాలెపు సోమశేఖర్, బిజెపి ఆచారి, వారాది నాగబాబు, నందమూరి అభిమానులు గొర్రెల రమణ, బిక్కిన సాంబ, కెవి శ్రీనివాస్, గొర్రెల శివ, నవీన్ చౌదరి, కొత్తల బ్రహ్మాజీ, మట్టా భానుకుమార్, కొండబాబు, పి.నాగబాబు, బత్తిన రాజు, వీరమల్లు భీమరాజు తదితరులు పాల్గొన్నారు.













