టీడీపీ అధికారంలోకి రాగానే.. అమరావతి నిర్మాణం

రాజధాని అమరావతి విధ్వంసానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్పడి నాలుగేళ్ల అయిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు గుర్తు చేశారు. ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీని జగన్ కామెడీ రాష్ట్రంగా మార్చారు. ఏపీకి రాజధాని ఏది అంటే చెప్పలేని పరిస్థితికి తీసుకొచ్చారు. జగన్ టీమ్ అమరావతిని దోచేశారు. రాజధాని రైతులకు కౌలు ఇవ్వలేదు గానీ మూడు రాజధానులు ఎలా కడతారు? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతగా జగన్ ఆనాడు అమరావతిని స్వాగతించి అధికారంలో రాగానే మాట మార్చారు. అమరావతి, ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న బ్రాండ్‌ను జగన్ పాడుచేశారు. టీడీపీ అధికారంలోకి రాగానే అమరావతి నిర్మాణం జరిగి తీరుతుంది అని స్పష్టం చేశారు.











































































