ఇన్ ఛార్జ్ ల మార్పుతో వైసీపీ ఓటమి : నక్కా ఆనందబాబు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వైఎస్ షర్మిల వస్తారేమోనని వైసీపీలోని అసంతృప్త నేతలంతా చూస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీతోనూ చాలా మంది టచ్లో ఉన్నారని తెలిపారు. వైసీపీలో ఇన్ఛార్జ్ల మార్పుపై ప్రజలంతా నవ్వుకుంటున్నారని, వారి ఆకృత్యాలను వేరే నియోజకవర్గం భరించాలా? అనే చర్చ ప్రజల్లో ఉందన్నారు. ఉద్యోగుల మాదిరిగా ఇష్టారీతిన నేతలను బదిలీ చేసుకుంటున్నారని విమర్శించారు. ఇన్ఛార్జ్ల మార్పుతో వైసీపీ ఓటమిని జగన్ ముందే అంగీకరించారని అన్నారు. ఎన్నిక మార్పులు చేసినా ప్రజా గ్రహం నుంచి జగన్ తప్పించుకోలేరని తెలిపారు. ఐప్యాక్, వాలంటీర్లతో నడిచే స్ట్రక్చర్ వైసీపీదని, కార్యకర్తల బలం, ప్రజాదరణతో నడిచే పార్టీ టీడీపీ అని వ్యాఖ్యానించారు. ప్రతి ఎస్సీ నియోజకవర్గంలో జగన్ షాడో ఎమ్మెల్యేలదే పెత్తనమని ఆరోపించారు.











































































