Sri Krishna Deva Raya: వైసీపీ భూ కుంభకోణాలపై నిగ్గు తేల్చండి : శ్రీకృష్ణదేవరాయులు
వైసీపీ హయాంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ (Land Titling Act) పేరుతో రూ.వేల కోట్ల విలువైన భూములు కొల్లగొట్టారని లోక్‌సభ (Lok Sabha) లో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు (Sri Krishna Deva Raya) వెల్లడిరచారు. రాష్ట్రంలో 40 వేల ఎకరాల అసైన్డ్ భూములను దోచేశారని, ప్రచార యావతో రూ.700 కోట్లు వృథా చేశారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని వైసీపీ (YCP) హయాంలో జరిగిన నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. కూటమి సర్కారు తెచ్చిన ల్యాండ్ రీ సర్వే అండ్ టైటిలింగ్ ఫ్రేమ్ వర్క్‌ను కేంద్రం ఆమోదించాలని కోరారు.













