Uttam Kumar Reddy: నీటిపారుదల రంగంలో ఆధునిక సాంకేతిక కావాలి: ఉత్తమ్‌కుమార్ రెడ్డి
రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి (Uttam Kumar Reddy) అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. నీటిపారుదల రంగంలో ఆధునిక సాంకేతికతను అమలు చేయాలని, ముఖ్యంగా సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీఓ)ను బలోపేతం చేయడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. మంగళవారం సెక్రటేరియట్లో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మేడిగడ్డ ఉదంతం, జస్టిస్ ఘోష్ కమిషన్ వ్యాఖ్యల కారణంగా దెబ్బతిన్న సీడీఓ ప్రతిష్టను తిరిగి నిలబెట్టాలని అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సీడీఓను పటిష్టం చేయాలని, ప్రాజెక్టుల డిజైన్ల రూపకల్పనలో ఆధునిక సాఫ్ట్వేర్ మరియు సాంకేతికతను వినియోగించాలని మంత్రి సూచించారు. ఒకప్పుడు దేశానికే ఆదర్శంగా నిలిచిన సీడీఓ ప్రతిభను తిరిగి ప్రదర్శించాలని కోరారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని, ఐఐటీ, ఎన్ఐటీల నుండి కొత్తగా నియమితులైన ఇంజినీర్లకు సీడీఓలో పోస్టింగ్‌లు ఇస్తామని మంత్రి (Uttam Kumar Reddy) తెలిపారు. అనుభవం ఉన్న నిపుణులు, పదవీ విరమణ పొందిన ఇంజినీర్ల సేవలను కూడా వినియోగించుకుని అత్యుత్తమ ఫలితాలు సాధించాలని ఆయన అధికారులను ఆయన (Uttam Kumar Reddy) ఆదేశించారు.







