నాకు ప్రాణహాని ఉంది.. గన్ లైసెన్స్ కోసం పోలీసులను ఆశ్రయించిన దువ్వాడ..
సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్ హైలైట్ గా ఉంది. నిన్న మొన్నటి వరకు ఆయన కుటుంబంలో వివాదాలు ఉన్నాయి అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే నిన్నటితో దువ్వాడ గుట్టు రోడ్డుకి ఎక్కింది. దువ్వాడ ఇద్దరు కూతుళ్లు టెక్కిలిలోని ఆయన నివాసం ఎదురుగా నిరసనకు దిగడం ప్రస్తుతం ఇరు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో దువ్వాడకు సంబంధించిన మరొక అంశం వైరల్ అవుతుంది. శ్రీనివాస్ గన్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. తన దగ్గర ఒక గన్ ఉందని.. అయితే ఇప్పుడు దానికి లైసెన్స్ ఇవ్వాలని ఈనెల ఏడవ తారీఖున జిల్లా పోలీసులను కలిసిన దువ్వాడ దరఖాస్తు అందజేశారు. అంతేకాదు గత కొద్ది రోజులుగా తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని పేర్కొన్న దువ్వాడ తన ఇంటి వద్ద అనుమానంగా రెక్కీ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అందుకే తనకు లైసెన్స్ మంజూరు చేయాల్సిందిగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పోలీసులను కోరారు. జూలైలో కూడా ఇదే విషయంపై శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ గుర్తు తెలియని నెంబర్ నుంచి తనకు ఫోన్ కాల్స్ వస్తున్నాయని.. తనకు ప్రాణహాని ఉందని పేర్కొన్న దువ్వాడ..తనకు 4+4 గన్మెన్లను కేటాయించాలని ప్రభుత్వానికి కూడా విన్నవించారు. ఇక నిన్నటితో శ్రీనివాస్ ఇంటి పోరు బయటపడింది. తమ తండ్రి కనీసం కాల్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని, మెసేజ్లకు కూడా రిప్లై ఇవ్వడం లేదని ఆయన కూతుర్లు ఆవేదన వ్యక్తం చేశారు. తండ్రి నీ కలవడానికి వచ్చిన కూతుర్లు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఇంటి బయటే ఎదురు చూశారు. తల్లికి ఇంకా విడాకులు కూడా ఇవ్వని తమ తండ్రి ఇంకొక మహిళతో ఆ ఇంట్లో ఉండాల్సిన అవసరం ఏమిటి అని వారు ప్రశ్నిస్తున్నారు.
ఎన్నికలకు ముందు దువ్వాడ కుటుంబంలో వివాదం మొదలైంది అన్న విషయం శ్రీనివాస్ కు ఆయన భార్య వానికి మధ్య జరిగిన టెక్కిలి సీట్ వివాదంతో అందరికీ అర్థమయింది. ఈ నేపథ్యంలో రీసెంట్గా తనకు గన్ లైసెన్స్ కావాలని.. బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని దువ్వాడ పోలీసులను ఆశ్రయించిన విషయం మరొకసారి లైమ్ లైట్ లోకి వచ్చింది. ఈ నేపథ్యంగా నేటిజెన్లు అతనిపై విమర్శలు కురిపిస్తున్నారు. కూతుర్లు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడానికి నీకు టైం లేదు.. బెదిరింపు ఫోన్ కాల్స్ మాత్రం మాట్లాడతావా.. అంటూ ఎద్దేవా చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ రచ్చపై అటు దువ్వాడ.. ఇటు వాణి ఇంకా స్పందించలేదు.













