Satyakumar: అసలు ఈ సంతకాలు ఎవరు పెట్టారో, వాళ్లకైనా తెలుసా? : మంత్రి సత్యకుమార్
ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) మంజూరు చేసిన వైద్య కళాశాలలను అప్పటి వైసీపీ (YCP) ప్రభుత్వం నిర్మించకుండా వదిలేసింది. ఇప్పుడు అవే వైద్య కళాశాలలను పీపీపీ మోడల్లో నిర్మిస్తుంటే రాద్ధాంతం చేయడాన్ని మంత్రి సత్యకుమార్ (Satyakumar) తప్పుబట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వాజపేయి (Vajpayee) కాంస్య విగ్రహావిష్కరణలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ కోటి సంతకాలు అని హడావుడి చేస్తున్నారు. ఐదు కోట్ల మంది జనాభాలో సగటున ఐదుగురిలో ఒకరు సంతకం చేస్తే కోటి మంది అవుతారు. అసలు ఈ సంతకాలు ఎవరు పెట్టారో, వాళ్లకైనా తెలుసా? ప్రేతాత్మలు, ఆత్మలు పెట్టాయా? అన్నారు.






