ప్రకాశం బ్యారేజీ చరిత్రలోనే ఇది పెద్ద వరద : మంత్రి నిమ్మల
ప్రకాశం బ్యారేజీకి వరద తగ్గుముఖం పడుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 11 లక్షల నుంచి 8 లక్షల క్యూసెక్యులకు వరద తగ్గిందని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు ముమ్మరం చేశాం. ప్రతి ఇంటికీ ఆహారం, తాగునీరు, పండ్లు పంపిణీ చేస్తున్నాం. ఆహారం అందలేదని ఫిర్యాదు రాకూడదని సీఎం చెప్పారు. రోడ్లపై బురద తొలగించేందుకు సిబ్బందిని రప్పిస్తున్నాం. పడవలు, ట్రాక్టర్ల ద్వారా ఆహారం పంపిణీ చేస్తున్నాం. ప్రకాశం బ్యారేజీ చరిత్రలోనే ఇంత పెద్ద ఎత్తున వరద రాలేదు. పెద్ద ఎత్తున విపత్తు వచ్చినా సీఎం సూచనలతో ముందుకెళ్తున్నాం. బ్యారేజీ గేట్లను ఢీకొన్న పడవలను వరద తగ్గాక తొలగిస్తాం. భవిష్యత్తులో కరకట్టలను మరింత పటిష్ఠం చేసేలా చర్యలు తీసుకుంటాం అని తెలిపారు.













