ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తా
ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి తాను సిద్ధమని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సృష్టం చేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో అధిష్ఠానం ఎక్కడ నిర్ణయిస్తే అక్కడ నుంచి పోటీ చేస్తానన్నారు. ప్లెక్స్ట్రానిక్స్ సంస్థతో ఒప్పందం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగ భృతిపై వచ్చే కేబినెట్ సమావేశంలో సృష్టత వస్తుందన్నారు. కేంద్ర ఏర్పాటు చేసే ప్రాజెక్టుల కోసం రాష్ట్రం రాయితీలు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. అయినా రాష్ట్రాభివృద్ధి కోసం రాయితీలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.













