Kollu Ravindra: ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణం.. ఏపీలోనే : మంత్రి కొల్లు రవీంద్ర
ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణం ఆంధ్రప్రదేశ్ లిక్కర్ (Liquor) స్వామ్ అని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) అన్నారు. కృష్ణా జిల్లా (Krishna District)లోని నాగాయలంక మండలం, సోర్లగోంది గ్రామం లో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ (Konakalla Narayana) తో కలిసి ఇంటింటి తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ గత ప్రభుత్వం ఐదేళ్లు ఇసుకలో భారీ దోపిడీ చేసింది. లిక్కర్ స్కామ్లో చీమల పుట్ట కదుపుతుంటే అందరి పేర్లు బయటకు వస్తున్నాయి. జిల్లాను సర్వనావనం చేసిన కొడాలి నాని(Kodali Nani), జోగి రమేష్, వంశీ అవినీతి బాగోతాలు అన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు చూసి ఓర్వలేక ప్రజల్లో అలజడులు సృష్టిస్తున్నారు. అందరం కలిసి జిల్లాలోని గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించే విధంగా కృషి చేస్తున్నాం. గాడి తప్పిన పరిపాలనను గాడిలో పెట్టాం. ఒకటో తేదీన జీతాలు, పింఛన్లు ఇస్తున్నాం అని మంత్రి పేర్కొన్నారు.













