చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండించిన వైగో
ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు అరెస్టుపై ఎండీఎంకే నేత వైగో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అరెస్టును ఖండించిన వైగో.. అరెస్ట్ రాజకీయ ప్రతీకార చర్య అని మండిపడ్డారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో కావాలంటే సమన్లు జారీ చేసి విచారణ చేయొచ్చని, కానీ అలా చేయకుండా నేరుగా అరెస్ట్ చేయడం కక్షపూరితం కాదా? అని నిలదీశారు. ఓ మాజీ ముఖ్యమంత్రిని ఇలా తీవ్రవాదిలా అరెస్ట్ చేయడం ఏమాత్రం సరికాదన్నారు. టీడీపీ అధినేత అరెస్ట్ కచ్చితంగా వైసీపీ ప్రతీకార చర్యకు నిదర్శనమన్న వైగో.. రాజకీయ కారణాలతో ఇలా అరెస్ట్ చేయించి సీఎం జగన్ సంతోషించవచ్చని, కానీ ఏపీ ప్రజలకు ఆయన చేసిన సేవలను మాత్రం చెరిపివేయడం కుదరదని స్పష్టం చేశారు. చంద్రబాబు ఈ సమస్యలన్నీ అధిగమించి తిరిగి బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.













