ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు సంఖ్య భారీగా పెరిగింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 35,196 కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 758 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 175, అత్యల్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో 13 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 8,95,879 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనా వైరస్ నుంచి 231 మంది కోలుకుని 231 మంది క్షేమంగా డిశ్చార్జ్ అయ్యారు.రాష్ట్రంలో ఇప్పటి వరకు 8,85,209 మంది డిశ్చార్జ్ అయ్యారు. గత 24 గంటల్లో కరోనా బారిన పడి చిత్తూరు జిల్లాలో ఇద్దరు, గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున నలుగురు మరణించారు. తాజా మరణాలతో రాష్ట్రంలో కొవిడ్‌తో మృతిచెందిన వారి సంఖ్య 7,201కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 3,469 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,48,75,597 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.