చంద్రబాబు నాయుడుకి 25 లక్షల రూపాయల చెక్కుని అందజేసిన మన్నవ మోహనకృష్ణ
రాజమండ్రిలో జరగనున్న మహానాడు వేడుకలకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, ఎన్టీఆర్ ట్రస్ట్ డైరెక్టర్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నాయకులు మన్నవ మోహనకృష్ణ 25 లక్షల రూపాయల చెక్కును తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి అందజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు మన్నవ మోహనకృష్ణని అభినందిస్తూ, ఎన్నో సంవత్సరాలుగా అటు అమెరికాలోను, ఇటు ఆంధ్రప్రదేశ్ లోను తెలుగుదేశం పార్టీకి అండగా వుంటూ తెలుగుదేశం పార్టీ అభ్యున్నతి కోసం ఎంతో శ్రమించిన మన్నవ మోహనకృష్ణని చంద్రబాబు నాయుడు గారు అభినందించారు. ఈ 2023 మహానాడుకి 25 లక్షల రూపాయలు అందించటమే గాక గత సంవత్సరం 2022లో ఒంగోలులో జరిగిన మహానాడుకు కూడా మన్నవ మోహనకృష్ణ 31 లక్షల రూపాయలు విలువైన వాటర్ బాటిల్స్ ని అందజేసిన విషయాన్ని చంద్రబాబు గారు ప్రస్తావించి మన్నవ మోహనకృష్ణని ప్రశంసించారు. పార్టీకి అంకితభావంతో పనిచేస్తూ, కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడడం అభినందనీయం అని, నిజాయితీగా ప్రజల కోసం పనిచేసేవారిని పార్టీ తప్పక గుర్తిస్తుందని చంద్రబాబు గారు అన్నారు.
ఈ సందర్భంగా మన్నవ మోహన కృష్ణ మాట్లాడుతూ తిరిగి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో కుర్చునే వరకు అవిశ్రాంత సైనికుడిలా పని చేస్తానని మన్నవ మోహనకృష్ణ ప్రకటించారు.













