Amit Shah: హోంమంత్రి అమిత్‌షాతో ఎంపీ లావు భేటీ
కేంద్ర హోంమంత్రి అమిత్‌షా (Amit Shah)తో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయులు (Sri Krishna Deva Raya) భేటీ అయ్యారు. పార్లమెంటులో ఫైనాన్స్ బిల్లు (Finance bill ) పై జరిగిన చర్చ సందర్భంగా ఏపీలో మద్యం కుంభకోణం (Liquor scandal ) లో విరుచుకుపడిన ఆయన, ఇప్పుడు హోంమంత్రిని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో కూటమి పాలన వ్యవహారాలతోపాటు వివిధ అంశాలను కేంద్ర హోంమంత్రి (Union Home Minister) దృష్టికి ఎంపీ తీసుకెళ్లినట్లు తెలిసింది. కేంద్రం, రాష్ట్రాల్లో కూటమి అధికారం చేపట్టాక ఎంపీ లావు వ్యక్తిగతంగా ఇలా హోంమంత్రిని కలవడం ఇదే తొలిసారి.













