Amaravati: చంద్రబాబు నేతృత్వంలో అమరావతిలో భూ సమీకరణ, భారీ ప్రాజెక్టులకు శుభారంభం..

ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని అమరావతి (Amaravati) పునర్నిర్మాణానికి మరోసారి కీలక మరదలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) నాయకత్వంలో రాజధాని నిర్మాణాలను మళ్లీ వేగవంతం చేయాలని నిర్ణయించింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సారధ్యంలో ఈ కార్యాచరణకు నూతన ఉత్సాహం లభిస్తోంది.
ఇటీవలే జరిగిన రాజధాని ప్రాంత అభివృద్ధి మండలి (CRDA) 50వ సమావేశంలో పలుముఖ్య నిర్ణయాలు తీసుకున్నారు. ఉండవల్లిలో (Undavali) జరిగిన ఈ సమావేశానికి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ( Narayana), ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ (Vijayanand) ,పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో అమరావతి అభివృద్ధికి సంబంధించిన ఏడు ప్రధాన అంశాలపై చర్చించి తీర్మానాలు ఆమోదించబడ్డాయి.
తుళ్లూరు (Thulluru) మండలంలోని మూడు గ్రామాల్లో అదనంగా దాదాపు 20,494 ఎకరాల భూమిని సమీకరించాలని నిర్ణయించారు. ఇక మందడం (Mandadam), రాయపూడి (Rayapudi), పిచుకలపాలెం (Pichukalapalem) పరిధిలో దాదాపు 58 ఎకరాల భూమిపై హైడెన్సిటీ రెసిడెన్షియల్ జోన్ , మిశ్రమ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రపోజల్స్ కోరనున్నారు. వీటితోపాటు, ఫైవ్ స్టార్ హోటళ్ల సమీపంలో కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి అనుమతులు లభించాయి. తుళ్లూరు, లింగాయపాలెం (Lingayapalem) ప్రాంతాల్లో 2.5 ఎకరాల విస్తీర్ణంలో నాలుగు ప్రాంతాల్లో ఈ సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.
ఇసుక అవసరాన్ని తీర్చేందుకు ప్రకాశం బ్యారేజి (Prakasam Barrage) ఎగువన డ్రెడ్జింగ్‌కు అనుమతి ఇవ్వడం జరిగింది. తద్వారా నిర్మాణాలకు అవసరమైన దాదాపు 159.54 క్యూబిక్ మీటర్ల ఇసుకను పొందాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భూముల కేటాయింపులో భాగంగా, కిమ్స్ (KIMS), జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (Zoological Survey of India), సీబీఐ (CBI), గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ (Gopichand Academy), ఎంఎస్కే ప్రసాద్ క్రికెట్ అకాడమీ (MSK Prasad Academy) వంటి 16 సంస్థలకు 65 ఎకరాల భూమి కేటాయించనున్నారు. అలాగే ఈ-15 రహదారిపై ఆరు లేన్ల ఆర్వోబీ నిర్మాణానికి కూడా ఆమోదం లభించింది. పొట్టి శ్రీరాములు (Potti Sriramulu), అల్లూరి సీతారామరాజు (Alluri Sitarama Raju) స్మారక చిహ్నాల కోసం అవసరమైన స్థలాన్ని కేటాయించే ప్రతిపాదనకు కూడా ఆమోదం లభించింది. అన్ని దశల్లో నిర్మాణాలకు వేగం చేకూర్చే విధంగా ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకుంటోంది.