Kollu Ravindra : అలా అయితే నెలరోజుల్లోనే లోపల వేయించేవాళ్లం : కొల్లు రవీంద్ర
గన్నవరంలో టీడీపీ పార్టీ కార్యాలయంపై దాడి కేసులో చేసిన తప్పు నుంచి తప్పించుకునేందుకు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vamsi) మరో నేరానికి పాల్పడ్డారని మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కొల్లు రవీంద్ర మాట్లాడారు. గతంలో వైసీపీ (YCP) నేతలు అధికారం అండతో కృష్ణా జిల్లా (Krishna District )లో పేట్రేగిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక నాయకుడు క్యాసినో (Casino) పెట్టి నోరుంది కదా అని బూతులు తిట్టాడు. మరో నాయకుడు కట్టుకున్న భార్యనే బియ్యం స్కామ్లో ఇరికించాడు. ఇంకో నాయకుడు పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. ఈ చర్యలన్నింటీని ఉపేక్షించాలా? కక్షపూరితంగా చేయాలనుకుంటే అధికారంలోకి వచ్చి నెల రోజుల్లోనే అందరినీ లోపల వేయించేవాళ్లం అని అన్నారు.













