Kodi Pandelu : ఏపీలో జోరుగా కోడి పందేలు.. భారీగా తరలివచ్చిన ప్రజలు
సంక్రాంతి సంబరాల్లో భాగాంగా ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాల్లో కోడి పందేలు(Kodi Pandelu) నిర్వహించారు. కృష్ణా జిల్లా (Krishna District) గన్నవరం నియోజకవర్గంలోని సూరంపల్లి, రామవరప్పాడు, అంపాపురంలో వీటిని నిర్వహించారు. పల్లెలోని బరుల్లోనూ పందేలు ఏర్పాటు చేశారు. వీటిని చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ఎన్టీఆర్ జిల్లా (NTR District) నందిగామా నియోజకవర్గంలోని కోడి పందేలు జోరుగా సాగాయి. నందిగామ, చందర్లపాడులో ఈ పోటీలు సాగాయి. కంచికచర్ల మండలం గండేపల్లి వద్ద టెంట్లు ఏర్పాటు చేసి భారీ ఎత్తున పందేలు నిర్వహిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెదఅమిరంలో కోడి పందేలను డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు (Raghuramakrishna Raju) ప్రారంభించారు. కోడీ పందేలు రూ.లక్షల్లో జరుగుతున్నాయి. బరుల్లో పందేల గురించి బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్నారు. పందెం రాయుళ్లు కత్తులు కట్టి కోడి పుంజులను బరిలోకి వదులుతున్నారు. నగదు తీసుకురాని వారి కోసం బరులు నిర్వహకులు స్పాట్ క్యాష్ సౌలభ్యం ఏర్పాటు చేశారు. పందేలను వీక్షించేందుకు గ్యాలరీలు సైతం ఏర్పాటు చేశారు.













