ఏపీ కేబినెట్ భేటీ … కీలక నిర్ణయాలు ఇవే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం 45 అంశాలపై చర్చించిన కేబినెట్ పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. సామాజిక పెన్షన్‌ను రూ.2,750 నుంచి రూ.3,000 పెంపునకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఏపీ కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలను మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ మీడియాకు వెల్లడించారు.
సామాజిక పెన్షన్లను రూ.2,750 నుంచి రూ.3000 వేలకు పెంపునకు కేబినెట్ ఆమోదం. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీలో పేదలకు రూ.25 లక్షల వరకూ ఉచితంగా వైద్యం. 90 శాతం కుటుంబాలకు ఆరోగ్య శ్రీ సేవలు. ఈ నెల 18 నుంచి ఆరోగ్య శ్రీ కార్డులు పంపిణి. విశాఖలో లైట్‌మెట్రో రేల్ ప్రాజెక్టు డీపీఆర్‌కు కేబినెట్ ఆమోదం. వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ విసృతంగా అవగావన కల్పించాలని సీఎం జగన్ ఆదేశం. జనవరి 1 నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడతలకు కేబినెట్ ఆమోదం. కుల, ఆదాయ ధ్రువీకరణాల పత్రాల మంజూరులో సంస్కరణలకు కేబినెట్ ఆమోదం. కోర్టుల్లో పనిచేసే సిబ్బంది, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా డీఏ, డీఆర్ చెల్లింపు. యాంటీ నక్సల్ ఆపరేషన్‌లో పనిచేసే టీమ్స్‌కు 15 శాతం అలవెన్స్ పెంపు. 51 రోజుల పాటు ఆడుదాం ఆంధ్రాలో 31 లక్షల మంది రిజిస్ట్రేషన్. ఆడుదాం ఆంధ్రా బ్రాండ్ అంబాసిడర్‌గా అంబటి రాయుడు. కేబినెట్ సబ్‌కమిటీ, స్టీరింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.













