అన్నదమ్ముల పొలిటికల్ వార్ తో హీట్ ఎక్కుతున్న విజయవాడ..
ఆంధ్రాలో ఎన్నికల పోరు మంచి జోరుగా సాగుతోంది. కొన్ని నియోజకవర్గాలలో కుటుంబ సభ్యులు ప్రత్యర్ధులుగా తలబడుతున్నారు. అలాంటి వాటిలో ముఖ్యమైనది విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం. అన్నదమ్ముల మధ్య ఓ రేంజ్ లో సాగుతున్న పోరు ఇక్కడ పరిస్థితులను మరింత వేడెక్కిస్తోంది. కేశినేని నానీ.. కేశినేని చిన్ని.. నిన్న మొన్నటి వరకు ఒకే గూటి పక్షులుగా టీడీపీలో కొనసాగిన ఈ అన్నదమ్ములు ప్రత్యర్ధులుగా ఒకరిపై ఒకరు మాటల కత్తులు దూస్తున్నారు. కేశినేని నానీ టీడీపీ గూటిని వీడి వైసీపీ కండువా కప్పుకున్నారు. దీంతో అన్నదమ్ములు ఇప్పుడు బద్ధ శత్రువులుగా మారారు. ప్రస్తుతం ఈ ఇద్దరి ప్రచారాలను ఎక్కువగా అవినీతి, అక్రమాలు, మాఫియా లాంటి విషయాలే చర్చలకు వస్తున్నాయి.
అన్న నానీ పై తమ్ముడు చిన్ని ఆరోపణలు చేస్తుంటే.. తమ్ముడిపై అన్న ఫైర్ అవుతున్నారు. చిన్ని దొంగ అని.. సొంత అన్న బాహాటంగా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో ఒకప్పుడు ఎంతో హుందాగా.. ప్రశాంతంగా ఉన్న విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం.. వ్యక్తిగత ఆరోపణలు, విమర్శలు, కేసులతో అతలాకుతలం అయిపోతుంది. మరో రెండు రోజుల్లో ఓటింగ్ ఉంది.. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి అన్నదమ్ముల గొడవలు పోలింగ్ పై ఎటువంటి ప్రభావం చూపిస్తాయి అన్న విషయం ఎవరికీ అర్థం కావడం లేదు.













