సీఎం అయితే ఆంధ్రాను అమెరికా చేస్తా
పాల్ రావాలి పాలన మారాలి అనే నినాదంతో ముందుకెళ్లాలని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పాస్టర్లకు పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జల్లా నరసాపురం, ఆచంట నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా పాస్టర్ల సమావేశంలో పాల్ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో తనను గెలిపించి ముఖ్యమంత్రిని చేస్తే రూ.7లక్షల కోట్లు తెచ్చి ఏపీని అమెరికాగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. పగిలిపోయే గాజు గ్లాసు, తుప్పుపట్టిన సైకిల్, ప్యాన్ పార్టీలకు ఓటు వేయవద్దని సూచించారు. తాను సంపాదించిన రూ.3.5 లక్షల కోట్లు ట్రస్టులకు ఇచ్చేశానని, ప్రస్తుతం తనకు రూపాయి ఆస్తి కూడా లేదన్నారు. జగన్‌ను గెలిపిస్తే రాష్ట్రంలో అవినీతే ఎక్కువగా ఉంటుందన్నారు. తమ్ముడు తమ్ముడు అంటున్న పవన్‌కు ఓటేస్తే గ్లాస్ గుర్తు పగిలిపోతుందన్నారు. కాగా నరసాపురం ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు కేఏ పాల్ వేసిన నామినేషన్లను ఎన్నికల అధికారులు ఆమోదించారు.













