టీటీడీ చైర్మన్ గా జంగా కృష్ణమూర్తి ?
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి చైర్మన్గా ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పేరు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిశీలనలో ఉన్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. వైసీపీ అధికారంలోకొచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి బాబాయి వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా కొనసాగుతున్నారు. మొదటి టర్మ్ పూర్తయ్యాక రెండోసారి ఆయన్నే చైర్మన్ చేశారు. ఈసారి వైవీ స్థానంలో జంగా కృష్ణమూర్తి పేరును పరిశీలిస్తున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చేవారంలో టీటీడీ బోర్డు నియామకంపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.













