ఈరోజు రాత్రి సతీసమేతంగా లండన్ కు పయనం అవుతున్న జగన్..

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. ఆంధ్రాలో ఎన్నికలు పూర్తయిన సందర్భంగా కుటుంబంతో కలిసి హాలిడేస్ గడపడానికి విదేశాలకు పయనం అవుతున్నారు. సుమారు రెండు నెలల పాటు ఎన్నికల నేపథ్యంలో చాలా బిజీగా గడిపిన జగన్.. విశ్రాంతి కోసం సతీ సమేతంగా విదేశాలకు బయలుదేరుతున్నారు. ఈ మేరకు కోర్టు నుంచి కూడా ఆయన పర్మిషన్ తీసుకున్న విషయం తెలిసిందే. ఈరోజు రాత్రి 11 గంటలకు విజయవాడ నుంచి లండన్ కు జగన్ బయలుదేరుతారు. ఈనెల 17 నుంచి జూన్ 1 వరకు విదేశాలకు వెళ్లడానికి కోర్టు ఆయనకు అనుమతి ఇచ్చింది. కోర్టు అనుమతి ఇవ్వడంతో ఈరోజు విదేశాలకు బయలుదేరుతున్న జగన్ కుటుంబంతో కలిసి లండన్, ఫ్రాన్స్, స్విజర్లాండ్ లో పర్యటిస్తారు. ఆ తర్వాత ఎన్నికల ఫలితాలు విడుదల నాలుగు రోజుల ముందు. అంటే ఈ నెల 31 కి తిరిగి ఆంధ్రాకి చేరుకుంటారు.











































































