ఐదు ఐటీ కంపెనీలు ప్రారంభించిన మంత్రి లోకేశ్
నవ్యాంధ్రప్రదేశ్లో ఐటీ రంగం అభివృద్ధికి అద్భుత అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. రాజధాని పరిసర ప్రాంతాల్లో నెలకొల్పుతున్న ఐదు ఐటీ కంపెనీలను గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ కార్యాలయ భవనంలో ఆయన ప్రారంభించారు. వాటిలో జీటీ కనెక్ట్ ఇండియా (విజయవాడ), పరిక్రోమ్ ఐటీ సొల్యూషన్స్ (విజయవాడ), టెక్ స్కేప్ (విజయవాడ), ట్రెండ్ సాఫ్ట్ (ఎన్ఆర్టీ టెక్ పార్క్, మంగళగిరి), డయాగ్నో స్మార్ట్ సొల్యూషన్స్ (ఎన్ఆర్టీ టెక్క్ పార్క్, మంగళగిరి) ఉన్నాయి. విజయవాడలోని ఏపీ ఆన్లైన్ కంపెనీ డెవలప్మెంట్ సెంటర్కు కూడా శ్రీకారం చుట్టారు. ఐటీ రంగంలో నాలుగున్నరేళ్లలో 34 వేల మందికి ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపారు.













