Satyakumar: పీపీపీ తప్పయితే నన్ను జైలుకు పంపు …జగన్ కు మంత్రి సత్యకుమార్ సవాల్
పీపీపీ విధానంలో చేపట్టే మెడికల్ కాలేజీల (Medical colleges) నిర్మాణంలో అక్రమాలకు పాల్పడిన వారందరినీ, అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే జైలుకు పంపుతామనడం జగన్ (Jagan) అహంకారానికి అద్దం పడుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ (Satyakumar) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పీపీపీ విధానం తప్పయితే, జగన్‌కు దమ్ముంటే, వైద్య శాఖ మంత్రిగా ఉన్న నన్ను ముందుగా జైలుకు పంపాలి అని సవాల్ విసిరారు. ఏపీకి విజిటింగ్ పొలిటీషియన్‌గా ఉన్న జగన్ రాష్ట్రానికి వచ్చిన ప్రతిసారీ చంద్రబాబు (Chandrababu), పవన్ కల్యాణ్, లోకేశ్‌ను తూలనాడుతున్నాడు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం, పార్లమెంట్ స్థాయి సంఘం, నీతి ఆయోగ్, జాతీయ వైద్య మండలి, హైకోర్టు, సుప్రీంకోర్టు అందరూ పీపీపీ విధానాన్ని సమర్థిస్తుంటే, ప్రధాని మోదీతో సహా వీరందర్నీ జైలుకు పంపుతావా? మెడికల్ కాలేజీలపై కోటి సంతకాల పత్రాలంటూ గవర్నర్‌నూ పక్కదారి పట్టిస్తున్నారు. వైసీపీ హయాంలో మెడికల్ కాలేజీలకు రూ.600 కోట్లు ఖర్చు పెట్టేలా ఉత్తర్వులిచ్చి అక్రమాలకు పాల్పడ్డారు. అవన్నీ బయటకు వస్తాయన్న భయంతోనే ప్రజల దృష్టిని మళ్లించేందుకు కుట్రలు పన్నుతున్నారు. ఆర్థిక నేరాల కేసుల్లో జగన్ మళ్లీ జైలుకెళ్లడం ఖాయం అని పేర్కొన్నారు.






