మన మారథాన్‌కు ప్రపంచస్థాయి గుర్తింపు
విజయవాడలో నిర్వహించిన అమరావతి మారథాన్‌కు అనూహ్య స్పందన వచ్చింది. కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి సుమారు 7500 మంది యువతీ యువకులు రన్లో పాల్గొన్నారు. హాఫ్‌మారథాన్, 10కే, 5కే రన్ విభాగాల్లో అమరావతి మారథాన్ నిర్వహించారు. బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అమరావతి మారథాన్‌కు ప్రపంచస్థాయి గుర్తింపు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మారథాన్‌ను విజయవాడతో పాటు తిరుపతి, విశాఖపట్నంలో నిర్వహిస్తున్నందుకు నిర్వాహకులను అభినందించారు.
10కే రన్ పురుషుల విభాగంలో విజయం సాధించిన విజయ్‌కుమార్, రమేష్, జయదేవ్, మహిళ విభాగంలో సౌజన్య, ప్రియదర్శిని, శివానీ, కీర్తికలకు, 21కే పురుషుల విభాగంలో గెలుపొందిన లింగన్న్, వెంకటేశ్వరావు, బాబూరావు, మహేంద్రలతో పాటు మహిళల విభాగంలో ఉషారాణికి ముఖ్యమంత్రి బహుమతులు ప్రదానం చేశారు. 21కే రన్ సీనియర్ పురుషుల విభాగంలో మహ్మద్, శ్రీనివాసరెడ్డి, సునీల్, శ్రీకాంత్, 10కే రన్ సీనియర్ విభాగంలో పార్థసారథి, బాబూరావు, ఈశ్వరరావు, సూర్యలకు చంద్రబాబు నగదు బహుమతి, జియో సెల్ఫోన్లు అందజేశారు.













