ఏపీలో ఎన్నికల వేళ విజృంభించిన మహిళ లోకం..
ఆంధ్రప్రదేశ్ లో సోమవారం నాడు జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ లో ఓటర్లు భారీ సంఖ్యలో తరలి వచ్చిన విషయం తెలిసిందే. సుమారు సోమవారం అర్ధరాత్రి రెండు గంటల వరకు పోలింగ్ జరిగిన ప్రదేశాలు కూడా ఉన్నాయి. అయితే ఈ ఎన్నికలలో భారీ ఎత్తున మహిళా ఓటర్లు ఓటు వేయడం ఆసక్తికరంగా మారింది. అయితే తరలి వచ్చిన మహిళా శక్తి ఏ పార్టీకి బలంగా మారబోతోంది అన్న విషయంపై కూడా జోరుగా చర్చలు జరుగుతున్నాయి. గత ఐదేళ్లలో వైసీపీ సంక్షేమ పథకాలన్నీ కూడా దాదాపు మహిళలను కేంద్రంగా మార్చుకొని నిర్వహించారు. ఇటు టీడీపీ కూడా ఎన్నికల్లో గెలిస్తే మహిళలకు ఎన్నో అద్భుతమైన పథకాలను అందిస్తాము అన్న ఆశ చూపించారు. మొత్తానికి మహిళా శక్తి ఎటువైపు ఉందో తెలియదు కానీ.. రాబోయే ఫలితాలలో వారి ప్రభావం మాత్రం గట్టిగా ఉంది అన్న విషయం అర్థం అవుతుంది.













