ఫిబ్రవరి లో లేపాక్షి ఉత్సవాలు
ఫిబ్రవరి 24, 25 తేదీల్లో లేపాక్షి ఉత్సవాలు జరుపుతామని సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు అమరావతికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను నటించిన లెజెండ్ సినిమా ఎక్కు నంది అవార్డులు గెలుచుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని అన్నారు. తనతో పాటు నంది అవార్డులు గెలుచుకున్న వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. సమగ్ర నీటి విధానం అమలు వల్ల హిందూపురంలో ఈసారి చెరువులన్నీ నిండాయన్నారు. ఈ ఏడాది వర్షాలు బాగా కురవడం శుభపరిణామమన్నారు. అనంతపురం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతోందని, దీంతో స్థానికంగా ఉపాధి పెరుగుతోందన్నారు.













