చరిత్రలో నిలిచిపోయేలా లేపాక్షి ఉత్సవాలు
లేపాక్షి నందది ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిద్దామని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు. ఈ నెల 31, ఏప్రిల్ 1వ తేదీల్లో నిర్వహించే లేపాక్షి ఉత్సవాలపై ఆయన అనంతపురంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ ప్రతి ఏడాదిలాగా కాకుండా ఈసారి హిందూపురం ప్రాంతానికి నీరిచ్చిన తర్వాతే ఉత్సవాలను నిర్వహించాలనే సంకల్పంతోనే వాయిదా వేసామన్నారు. హిందూపురం ప్రాంతంలోని అన్ని చెరువులకు నీరిచ్చి ఉత్సవాలను నిర్వహిస్తామని, ఇందులో భాగంగానే ఈ నెల 31న ముఖ్యమత్రి చంద్రబాబు జలహారతి ఇవ్వనున్నట్లు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మానస పుత్రిక హంద్రీనీవా అని, దాని ద్వారా హిందూపురానికి నీరందించి ఉత్సవాలు నిర్వహించడం ఆనందంగా ఉందని తెలిపారు. చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉత్సవాలను నిర్వహిస్తామని అన్నారు. అనంతరం లేపాక్షి ఉత్సవాల లోగోను ఆవిష్కరించారు.













