2024 లో హై టెన్షన్ నియోజకవర్గాలు ఇవే..
ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కిపోనున్నాయి. ప్రచారాలతో పాటు విమర్శలు.. సెటైర్లు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. అన్నిటి మధ్యలో 4 సీట్లు మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. ఈ నాలుగు నియోజకవర్గాలలో ఫ్యాను తన హవా నడవాలి అని ప్రయత్నిస్తుంటే మరోపక్క సైకిల్ స్పీడ్ పెంచేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మూడు స్థానాలు రెండు పార్టీలకి పెద్ద ప్రిస్టేజ్ పాయింట్ గా మారాయి.
పులివెందుల:
వైయస్సార్ కుటుంబం అడ్డాగా.. జగన్ కంచుకోటగా భావించి పులివెందులలో గత కొద్ది కాలంగా రాజకీయ పోరు నడుస్తోంది. ఇక్కడ ఎప్పుడూ వారు వన్ సైడ్ అనడంలో సందేహం లేదు.. అయితే సొంత ఆడపడుచులు చేస్తున్న ఆరోపణల కారణంగా జగన్ ఇక్కడి నుంచి కొంత వ్యతిరేకత ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది. టీడీపీ కూడా ఈసారి ఈ నియోజకవర్గం పై ఫుల్ ఫోకస్ పెడుతోందని టాక్.
కుప్పం:
ఎమ్మెల్యేగా ఏడుసార్లకు మించి వరుసగా చంద్రబాబు గెలిచిన నియోజకవర్గం కుప్పం. టీడీపీ కోటపై ఈసారి వైసీపీ జెండా ఎగరాలి అని జగన్ భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలో కుప్పంలో భారత్ ని గెలిపించినట్లయితే అతన్ని మంత్రిని కూడా చేస్తాను అని జగన్ అనడం చర్చనీయాంశంగా మారింది. దీంతో కుప్పం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
మంగళగిరి:
రానున్న ఎన్నికల్లో మరొక హాట్ సీట్ మంగళగిరి. గత ఎన్నికల్లో లోకేష్ ను వైసిపి ఇక్కడ ఓడించింది. ఈసారి కూడా అదే జరగాలి అనేది వైసిపి పంతమైతే.. మారిన లెక్కలు మరొక తీరును సూచిస్తున్నాయి. గత ఎన్నికల లోకేష్ కి ఇప్పుడు లోకేష్ కి ప్రజలు ఎంతో తేడా గమనిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి కాంపిటీషన్ చాలా టఫ్ గా కనిపిస్తుంది.
పిఠాపురం:
పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాను అని ప్రకటించిన తర్వాత పిఠాపురం కూడా హాట్ సీట్ గా మారిపోయింది. తనకు చెప్పకుండానే పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించడంపై వర్మ ఫీల్ అవ్వడంతో.. ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి రెడీ అవుతున్నాడని టాక్. పోనీ పవన్ సామాజిక వర్గం ఓట్లు బలంగా ఉన్నాయి కాబట్టి గెలుస్తాడు అనుకుందాము అనుకుంటే.. ముద్రగడ్డ ఇప్పుడు వైసీపీలో చేరాడు. దీంతో పిఠాపురంలో టెన్షన్ పీక్ లెవెల్ లో ఉంది.













