ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం మరోసారి తేల్చి చెప్పింది. ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక సాయం మాత్రమే చేస్తామని ప్రకటించింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక సాయం ప్రకటించామని కేంద్రం తెలిపింది. పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశంపై వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ అడిగిన ప్రశ్నకు కేంద్రహోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 14వ ఆర్థికసంఘం సిఫార్సులతో హోదా అంశం మరుగునపడిందన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య పరిష్కారం కాని అంశాలపై దృష్టిపెట్టామని తెలిపారు. త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని నిత్యానందరాయ్ ప్రకటించారు.













