సీఎం సహాయనిధికి జెమ్ గ్రానైట్స్ విరాళం
చెన్నైకి చెందిన ఇంపీరియల్ గ్రానైట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (జెమ్ గ్రానైట్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్) ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.1.05 కోట్ల విరాళం అందించింది. అమరావతి సచివాలయంలో జెమ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ ఆర్. వీరమణి, జెమ్ గ్రానైట్స్ డైరెక్టర్ ఆర్.గుణశేఖరన్లు ముఖ్యమంత్రిని కలిసి ఈ మేరకు బ్యాంకు డీడీని అందించారు. కోవిడ్`19 నివారణకు సీఎం వైఎస్ జగన్ తీసుకున్న సమర్థవంతమైన చర్యలు తమను ఎంతగానో ప్రభావితం చేశాయని ఈ సందర్భంగా వీరమణి వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా పాల్గొన్నారు.













