13 నుంచి గణపతి నవరాత్రి మహోత్సవాలు
శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 13 నుంచి 22 వరకు గణపతి మహోత్సవాలు వైభవంగా జరగనున్నట్లు దేవస్థానం ఈవో శ్రీరామచంద్రమూర్తి తెలిపారు. ఉత్సవాల్లో ప్రతిరోజూ ఆలయ ప్రాంగణంలోని రత్నగర్భ గణపతిస్వామికి, యాగశాలలోని పంచాలోహమూర్తికి, సాక్షి గణపతిస్వామికి వ్రతకల్ప విశేషార్చనలు నిర్వహించనున్నట్లు వివరించారు. సాక్షిగణపతి ఆలయం వద్ద మృత్తికా గణపతిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 13వ తేదీన ఉదయం 8:30 గంటలకు గాయశాల ప్రవేశం, వేదస్వస్తి, శివసంకల్పం, గణపతిపూజ, స్వస్తి పుణ్యాహవాచనం, కంకణపూజ, ఋత్విగ్వరణం కార్యక్రమాలు జరుగుతాయన్నారు. 22న ఉదయం 7:30 గంటల నుంచి పూర్ణాహుతి కార్యక్రమంతో ఉత్సవాలు ముగుస్తాయన్నారు.













