విశాఖలో విజయవంతంగా ముగిసిన జీ-20 సదస్సు
విశాఖ వేదికగా మూడు రోజులపాటు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రెండవ జీ-20 ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ (ఐడబ్ల్యూజీ) సమావేశం విజయవంతంగా ముగిసింది. ముగింపు అజెండాలో 2023 ఇన్ఫ్రాస్ట్రక్చర్ అజెండాలో వివరించిన ఇతర ప్రాధాన్యతలతో పాటు రేపటి ఆర్థిక నగరాల్లో ఫైనాన్సింగ్‌ను పెంచే మార్గాలపై చర్చలు ఉన్నాయి. ఇండియన్ జీ-20 ప్రెసిడెన్సీ, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సంయుక్తంగా జీ`20 ప్రతినిధుల కోసం కెపాసిటీ బిల్డింగ్ వర్క్‌షాప్‌ను నిర్వహించాయి. వర్క్‌షాప్ పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి, పైనాన్సింగ్ అంతర్జాతీయ ఉత్తమ పద్ధతుల లక్ష్యంగా చర్చలు కొనసాగాయి. వర్క్‌షాప్ స్థానిక ప్రభుత్వాలకు సమ్మిళిత, స్థితిస్థాపకత, స్థిరమైన నగరాల కోసం అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ఫైనాన్స్ చేయడానికి అవసరమైన సామర్థ్యాలను హైలెట్ చేసింది. తర్వాత సమర్థవంతమైన క్రాస్ లెర్నింగ్‌ని ప్రారంభించడానికి తరగతి గది సెషన్లు క్షేత్రస్థాయి పర్యటనలు చేశారు. ఈ క్షేత్ర సందర్శన పట్టణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు వివిధ ఫైనాన్సింగ్ పథకాల వినూత్న లక్షణాలపై అవగాహనను బలోపేతం చేయడానికి ప్రయత్నించాయి.
జీ-20 సదస్సుకు హాజరైన పలు దేశాల ప్రతినిధుల బృందం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు ప్రభుత్వ పథకాలను సందర్శించి, వాటి పనితీరు, నిర్వహణ తదితర అంశాలపై పరిశీలన చేశారు. వర్క్‌షాప్ విశాఖపట్నంలో రెండువ ఐడబ్ల్యూజీ సమావేశాలను విజయవంతం చేసినందుకు భారత ప్రభుత్వ అధికారులకు, విశాఖపట్నం జిల్లా కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్ ఇతర శాఖల ఉన్నతాధికారులకు జీ-20 విదేశీయ ప్రతినిధి బృందం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.













