వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేస్తా
తాను రాజకీయాల్లో ఉన్నానని, వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేస్తానని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఓ ప్రైవేటు పాఠశాల వార్షికోత్సవానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని తెలిపారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా తనవంతు కృషి చేస్తానని తెలిపారు. 1980వ సంవత్సరంలో వావివాల గోపాలకృష్ణ చేపట్టిన పైసా ఉద్యమం స్ఫూర్తితో ప్రతి తెలుగు కుటుంబం నెలకు రూ.100 ఇస్తే రూ.850 కోట్లు సమకూరుతుందన్నారు. ఇలా 4 నెలల పాటు నిధులు సేకరిస్తే స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకోవచ్చని తెలిపారు.













