గీతాంజలి కేసులో టిడిపి సోషల్ మీడియా కార్యకర్త అరెస్ట్..
ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో తెనాలికి సంబంధించిన గీతాంజలి అనే అమ్మాయి ఆత్మహత్య వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం గా మారింది. వైసిపి ప్రభుత్వం పథకాల ద్వారా తన కుటుంబం అందుకున్నటువంటి లబ్ధి గురించి మీడియా ముందు ఆనందాన్ని వ్యక్తీకరించింది గీతాంజలి. ఈ వీడియో వైరల్ అయిన అనంతరం ఆమెపై సోషల్ మీడియా వేదికగా పలు రకాల విమర్శలు వెల్లువెత్తాయ చాలామంది ఆమె మాట్లాడిన తీరు, కంటెంట్ పై ట్రోలింగ్ కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఒక వర్గానికి సంబంధించిన నెటిజన్లు ఆమెను టార్గెట్ చేశారు అన్న ప్రచారం కూడా జరిగింది. మొత్తానికి ఈ వివాదాల మధ్య గీతాంజలి చనిపోయింది. రైలు ప్రమాదంలో చనిపోయింది అని కొందరు అంటుంటే ,ఆత్మహత్య చేసుకుంది అని మరికొందరు వాదిస్తున్నారు. ఆమెను టార్గెట్ చేసి, వల్గర్ గా పోస్టులు పెట్టి మానసికంగా హింసించడం వల్లే ఆమె చనిపోయింది అని వైసిపి వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్పందించిన ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. టిడిపి సోషల్ మీడియా కార్యకర్త పసుమర్తి రాంబాబు గీతాంజలి కేసు విషయంలో అరెస్ట్ అయ్యారని తెలుస్తోంది. సోషల్ మీడియా వేదికగా రాంబాబు పేరు మీద ఉన్నటువంటి అకౌంట్లో గీతాంజలి పై కొన్ని అసభ్యకరమైన పోస్టులు ఉండడంతో.. బోండా ఉమా అనుచరుడైన పసుమర్తి రాంబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక గీతాంజలి కేస్ ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.













